ఇంగ్లండ్‌ – ఇండియా టూర్ వాయిదా!

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడు క్రికెటింగ్‌ యాక్షన్ మొదలు పెడదామా అని వెయిట్ చేస్తున్న టీమిండియాకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. సెప్టెంబర్–అక్టో బర్‌లో ఇండియాలో జరగాల్సిన ఇంగ్లండ్‌ టూర్‌ పోస్ట్‌పోన్‌ కావడం దాదాపుగా ఖాయమైంది. 2020-21 సీజన్లో టీమిండియాకు సొంతగడ్డపై ఇది తొలి సిరీస్. ఇందులో భాగంగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉండడంతో ఈ టూర్ వాయిదా వేయడం తప్ప మరోదారి కనిపించడం లేదు. ఈ నెల 17న జరిగే బోర్డు మీటింగ్ తర్వాత ఈ సిరీస్‌‌పై అధికారిక ప్రకటన వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ‘ఇంగ్లండ్‌.. ఇండియా టూర్‌ కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిరీస్ నిర్వహించడం అసాధ్యం. అందుకే రీషెడ్యూల్ చేస్తాం’ అని ఆ అధికారి పేర్కొన్నారు. ఇదే జరిగితే స్వదేశంలో ఓ సిరీస్ ఆడేందుకు టీమిండియా 2021 దాకా ఆగాల్సిందే. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వచ్చే జనవరిలో ఇంగ్లిష్ జట్టు ఇండియా రావాల్సి ఉంది. ఇప్పుడు జరగాల్సిన సిరీస్లు వాయిదా పడితే వాటిని టెస్ట్ సిరీస్ టైమ్ లో నిర్వహించొచ్చు.

Latest Updates