ఇంగ్లండ్ మళ్లీ తడబ్యాటు

సెకండ్‌ఇన్నింగ్స్‌‌లో 284/8
క్రాలీ, సిబ్లే హాఫ్ సెంచరీలు
చెలరేగిన గాబ్రియెల్‌‌,జోసెఫ్

ఇంగ్లండ్‌ గడ్డ పై కరీబియన్లు ఇరగదీస్తున్నారు. పవర్ఫుల్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికిస్తున్నారు.! ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగానే పోరాడినా విండీస్‌‌ వీరులు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు..! రెండు సెషన్లలో స్టోక్స్‌సేన ఆధిపత్యం చెలాయించినా.. ఆఖరి సెషన్‌లో ప్రత్యర్థి ఆట కట్టించారు..! షెనన్‌ గాబ్రియెల్‌ (3/62), అల్జారీ జోసెఫ్‌ (2/40), రోస్టన్‌ చేజ్ (2/71) అద్భుత బౌలింగ్‌తో 30 పరుగుల తేడాతో ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌‌ను తమ వైపు తిప్పుకున్నారు..! దాంతో ఓ దశలో 249/3తో విజయంపై కన్నేసిన హోమ్‌టీమ్‌ ఫోర్త్‌‌ డే చివరకు 284/8తో డిఫెన్స్‌లో పడింది..! ప్రస్తుతానికి 170 రన్స్‌ లీడ్‌లో మాత్రమే ఉంది. మ్యాచ్‌కు నేడే చివరి రోజు. చివరి 2 వికెట్లు త్వరగా తీసేస్తే విండీస్‌‌కు విజయావకాశాలు పుష్కలం.

సౌతాంప్టన్‌‌: ఇంగ్లండ్‌ తో ఫస్ట్‌‌ టెస్టులో వెస్టిండీస్‌ విజయంపై కన్నేసింది. గత రెండు రోజులతో పోలిస్తే హోమ్‌‌టీమ్‌‌ బాగానే పోరాడింది. రెండు సెషన్ల పాటు ఆధిపత్యం చెలాయించింది. కానీ, లాస్ట్‌‌సెషన్‌‌లో క్లాసిక్ బౌలింగ్‌‌తో అదరగొట్టిన కరీబియన్లు ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. దాంతో నాలుగో రోజు శనివారం ఆట చివరకు ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌‌లో 284/8 స్కోరుతో నిలిచింది. జాక్ క్రాలీ (127 బంతుల్లో ఫోర్లతో 76), డామినిక్‌‌ సిబ్లే(164 బంతుల్లో 4 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలకు తోడు బెన్ స్టోక్స్ (46), రోరీ బర్న్స్ (42) సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌‌లో 284 స్కోరుతో నిలిచింది. జోఫ్రా ఆర్చర్(5 బ్యాటింగ్), మార్క్‌‌వుడ్‌ (1 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఆదివారం తొలి సెషన్‌ ‌ఆటే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్‌ చేయనుంది. ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్‌ 204 రన్స్‌‌కే ఆలౌటవగా.. విండీస్‌ 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఆచితూచి..జోరు పెంచి
ఓవర్ నైట్‌ ‌స్కోరు 15/0తో ఇంగ్లండ్‌ ఆట కొనసాగించగా.. మార్నింగ్‌‌ సెషన్‌‌లో ఓపెనర్లు రోరిబర్న్స్‌, సిబ్లే చాలా జాగ్రత్తగా బ్యాటింగ్‌‌చేశారు. కీమర్ రోచ్‌, గాబ్రియెల్‌ ఔట్‌‌సైడ్‌ ఆఫ్ స్టంప్, షార్ట్‌‌ పిచ్‌, ఫుల్‌ లెంగ్త్‌‌బాల్స్‌‌తో పరీక్ష పెట్టగా ఇంగ్లిష్ బ్యాట్స్‌‌మ్సెన్‌‌ ఏ మాత్రం తొందర పడలేదు. ఒక దశలో 9 ఓవర్లలో మూడే పరుగులు చేశారు. అయితే, లంచ్‌ ముందు ఏకాగ్రత కోల్పోయిన బర్న్స్‌… చేజ్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వేసిన షార్ట్‌‌బాల్‌ను కట్‌‌షాట్‌ ఆడి బ్యాక్‌‌వర్డ్‌ ‌పాయింట్‌‌లో కాంప్‌బెల్‌‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో, ఫస్ట్‌‌ వికెట్‌‌కు 72 రన్స్‌‌ పార్నర్ట్‌షిప్‌ బ్రేక్‌ ‌అయింది. ఫస్ట్‌‌ సెషన్‌‌లో 64 పరుగులే చేసిన ఇంగ్లండ్‌79/1తో లంచ్‌‌కు వెళ్లింది. బ్రేక్‌‌తర్వాత జోడెన్లీ(29)తో కలిసి సిబ్లే క్రమంగా వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు వంద దాటించడంతో పాటు సిబ్లే కెరీర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి బాల్‌కే అతను బౌల్డ్‌‌ అవగా.. గాబ్రియెల్‌ లైన్‌‌దాటడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. కానీ, అదే ఓవర్లో లెగ్‌‌సైడ్‌ వెళ్తున్న బంతిని వెంటాడి కీపర్కు చిక్కాడు. ఈ దశలో డెన్లీకి క్రాలీ తోడవగా.. ఇద్దరూ విండీస్‌ బౌలరపై ఎదురుదాడికి దిగారు. దాంతో చూస్తుండగానే స్కోరు 150 దాటింది. కానీ, చేజ్‌ ‌బౌలింగ్‌‌లో చెత్త షాట్‌ ‌ఆడిన డెన్లీ… హోల్డర్కు ఈజీ క్యాచ్‌ ఇచ్చాడు. సెకండ్‌ సెషన్‌‌లో 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 89 పరుగులు చేసింది. బ్రేక్‌‌ నుంచి వచ్చాక వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టిన క్రాలీ హాఫ్ సెంచరీ దాటగా.. స్టోక్స్‌‌కూడా దూకుడు పెంచాడు. న్యూబాల్‌ రాగానే స్టోక్స్‌ ‌క్లాసిక్‌ ‌డ్రైవ్స్‌‌తో ఆకట్టుకోగా… క్రాలీ కట్‌‌, రివర్స్‌‌స్వీప్‌, బ్యాక్‌‌ఫుట్‌‌ పంచెస్‌తో బౌండ్రీలు రాబట్టాడు.

16 పరుగులు.. 3 వికెట్లు
స్టోక్స్‌‌, క్రాలీ జోరు జోరు చూస్తుంటే మరో వికెట్‌‌పడకుండానే ఇంగ్లండ్ రోజు ముగించేలా కనిపించింది. ఈ దశలో విండీస్‌ బౌలర్లు మళ్లీ రేసులోకొచ్చారు. 16 పరుగుల తేడాతో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. కెప్టెన్ హోల్డర్.. మరోసారి స్టోక్స్‌‌ను ఔట్‌‌చేసి నాలుగో వికెట్‌‌కు 98 రన్స్‌‌పార్నర్ట్‌‌ షిప్ ను బ్రేక్‌‌చేశాడు. . మరుసటి ఓవర్లోనే క్రాలీని రిటర్న్‌‌ క్యాచ్‌తో వెనక్కుపంపిన అల్జారీ జోసెఫ్‌‌ కాసేపటికే
జోస్‌ బట్లర్(9)ను బౌల్డ్‌‌ చేసి విండీస్‌ శిబిరంలో జోష్ నింపాడు. జోసెఫ్‌‌నెక్స్‌ ట్ఓవర్లోనే కీపర్ డౌరిచ్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడంతో డామ్‌‌బెస్‌ (3) బతికిపోయాడు. కానీ, సెషన్‌‌చివర్లో ఒకే ఓవర్లో బెస్‌తో పాటు హోలీ పోప్( 12)ను బౌల్డ్‌‌ చేసిన గాబ్రియెల్‌ మ్యాచ్‌ను విండీస్‌ చేతుల్లోకి తెచ్చాడు.

For More News..

ఆగస్టు తరువాత మారటోరియం అవసరం లేదు

ట్రెయినింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ప్లేయర్

ఊపందుకున్న సైకిల్ సవారీ

గ్రేటర్లో కరోనా మృతులకోసం ప్రత్యేక శ్మశానాలు!

Latest Updates