జగజ్జేత ఇంగ్లాండ్ కు చుక్కలు చూపెట్టిన ఐర్లాండ్

వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్ కు పసికూన ఐర్లాండ్ చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ కు ఐర్లాండ్ కు మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో తొలి  ఇంగ్లాండ్ ను  23.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూల్చింది. ఐర్లాండ్ బౌలర్ ముర్తాగ్ 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లను సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేర్చాడు. తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడం ఇంగ్లాండ్ కు ఇది ఐదోసారి. ప్రస్తుతం14 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ 33 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

Latest Updates