స్టార్ క్రికెటర్ కు కరోనా వైరస్

పాకిస్తాన్ క్రికెట్  లీగ్ లో పాల్గొన్న ఓ ఇంగ్లాడ్ క్రికెటర్ కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వైరస్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన అన్నీ ఫార్మాట్ల క్రికెట్ మ్యాచ్ లన్నీ ఆగిపోయాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా పాక్ లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరుపున ఇంగ్లాండ్ కు చెందిన ఓ క్రికెటర్ ఆడుతున్నాడు. ఆ క్రికెటర్ లో  కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో పాక్ క్రికెట్ బోర్డ్ ఇంటికి పంపించింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ టెస్ట్ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ ఇంగ్లాడ్ క్రికెటర్ లో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుకే అతన్ని తన సొంతదేశానికి పంపించేశాం. ఈ సమయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేలా చూసుకుందామని అన్నారు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీం ఖాన్ మాట్లాడుతూ లీగ్‌లో పాల్గొన్న ఇంగ్లాండ్  ఆటగాడికి కరోనావైరస్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఆటగాడు ఎక్కడున్నాడనే విషయాన్ని వెల్లడించలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న క్రికెటర్లకు, సిబ్బందికి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Latest Updates