ఇంగ్లండ్ తో మ్యాచ్.. ఆస్ట్రేలియా 223 ఆలౌట్

బర్మింగ్ హామ్ : ఎడ్జ్ బాస్టన్ లో వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా 223 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. లోకల్ టీమ్ ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది.

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఐతే… ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కలేదు. స్టార్ బ్యాట్స్ మన్ ఫించ్ తాను ఆడిన ఫస్ట్ బాల్ కే డకౌటయ్యాడు. డేవిడ్ వార్నర్ 9 రన్స్ కే వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 85 రన్స్ తో ఆస్ట్రేలియాకు ఆ మాత్రం స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలెక్స్ క్యారే 46, స్టార్క్ 29, మాక్స్ వెల్ 22 రన్స్ తో ఓకే అనిపించారు. మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేదు. 49 ఓవర్లలో ఆస్ట్రేలియా 223 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆడిల్ రషీద్ 3, ఆర్చర్ 2, వుడ్ 1 వికెట్ పడగొట్టారు.

టార్గెట్ భారీగా లేకపోవడంతో .. ఇంగ్లండ్ సెమీస్ గడప దాటి.. ఫైనల్ కు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.

Latest Updates