వరల్డ్ కప్ ఫైనల్ : ఇంగ్లండ్ టార్గెట్ 242

లండన్ లార్డ్స్ లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2019 మెగా ఫైనల్ లో ఆతిథ్య ఇంగ్లండ్ కు న్యూజీలాండ్ జట్టు ఛాలెంజింగ్ టోటల్ ను లక్ష్యంగా నిర్దేషించింది. 50 ఓవర్లలో న్యూజీలాండ్ 8 వికెట్లు కోల్పోయి 241 రన్స్ చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజీలాండ్.. ఆరంభంలోనే గప్తిల్(19) వికెట్ కోల్పోయింది. తర్వాత కెప్టెన్ విలియంసన్(30)తో కలిసి… ఓపెనర్ నికోల్స్(55) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. లాథమ్ 47 రన్స్ తో రాణించాడు. మిడిలార్డర్ తలోచేయి వేయడంతో.. న్యూజీలాండ్ సవాల్ విసరదగ్గ స్కోర్ సాధించింది.

ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ , ప్లంకెట్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆర్చర్, వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ 242 రన్స్ చేసి లక్ష్యాన్ని ఛేదిస్తే.. మొట్టమొదటి వరల్డ్ కప్ ను గెల్చుకుని రికార్డ్ సృష్టించే అద్భుతమైన అవకాశం ఉంది. ఇంగ్లండ్ ను నిలువరించి.. మొట్టమొదటి ప్రపంచకప్ ను గెల్చుకోవాలని కివీస్ కూడా ఉత్సాహంగా ఉంది.

Latest Updates