హార్ధిక్​ టాలెంట్​ అదుర్స్​

పట్టుమని పదేళ్లు కూడా లేవు..  కానీ బాల మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయస్సులోనే అసామాన్య ప్రతిభతో అబ్బుర పరుస్తున్నాడు.  చదివేది యూకేజీ అయినా..  తండ్రి ప్రోత్సాహంతో దేశాలు, రాష్ట్రాలు, క్యాపిటల్​సిటీస్​, టెన్త్​ నుంచి పీజీ వరకు ఉన్న ఆయా సబ్జెక్ట్స్,  వాటిలోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. ‘ఇండియా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​​’ సంస్థ నుంచి ఈ ఏడాది బాల మేధావి (ఎన్​లైటెడ్​)  అవార్డును అందుకున్నాడు  హార్ధిక్.

హన్మకొండలోని గోపాలపూర్​కు చెందిన హార్ధి క్​  ముంజమ్ ​యూకేజీ చదువుతున్నాడు.   తండ్రి డాక్టర్​ శ్రీనివాస్​ ముంజమ్​ కేయూలో డిపార్ట్​మెంట్​ఆఫ్​ మైక్రోబయాలజీ ప్రొఫెసర్​గా విధులు నిర్వహిస్తున్నారు.  తల్లి ప్రియాంక ముంజమ్​బ్యూటిషన్​గా చేస్తున్నారు.  మూడు  సంవత్సరాల వయస్సులోనే  హార్ధిక్ నర్సరీ సబ్జెక్ట్​ను అలవోకగా చెప్పడాన్ని తండ్రి గమనించారు.  కొడుకు జ్ఞాపక శక్తికి మరింత పదును పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి రోజు మూడు గంటల సమయాన్ని అతడికే కేటాయించారు.

ఈ క్రమంలో118 రసాయన మూలకాలు,  ఇండియాలో రాష్ట్రాలు,  వాటి క్యాపిటల్​ సిటీస్, 50 దేశాలకు సంబంధించిన జాతీయ జెండాల పేర్లు, వాటి రాజధానులు,  ప్రయాణంలో భద్రతా సూచనలు,  నీటి వనరులు, మ్యూజికల్​ ఇన్​స్ట్రుమెంట్స్​, పుడ్​ఐటమ్స్​,  సీరియల్స్​, ఉభయ చరాల జంతువుల పేర్లు, రవాణ సంస్థలు, సంవత్సరాలు, నెలలు, మతాలు వారి దేవాలయాల పేర్లు, ఫలాలు, పక్షులు, దేశ నాయకులు, కంప్యూటర్​ పరికరాల పేర్లు, ఇండియన్ ఫెస్టివల్స్​,  కులవృత్తులు, కూరగాయలు,  కీటకాలు ఇలా పైన పేర్కొన్న  ఏ అంశం గురించి అడిగినా టక్కున సమాధానం చెప్పేలా తండ్రి హార్ధిక్​ ను తీర్చిదిద్దారు .

ప్రస్తుతం ఏడు సంవత్సారాలు ఉన్న చిన్నారి టాలెంట్ గురించి.. హరియాణా రాష్ట్రం పరియాద్​లో ని ‘ఇండియా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​​’నిర్వాహకులకు  సమాచారం ఇచ్చారు.  సంస్థ నిర్వాహకులు  అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఆ బాలుడు అబ్బురపరిచాడు.  ‘ఇండియా బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​​’  సంస్థ అతడిని బాలమేధావి(ఎన్​లైటెడ్​ మైనర్​)గా గుర్తించి..  మెమొంటో, స్పెషల్ ఐడీకార్డు, రికార్డు సర్టిఫికెట్​ అందించి సన్మానించింది.

సంతోషంగా ఉంది
నా కుమారుడి ప్రతిభను చూసి చాలా సంతోష పడుతున్నా. హార్థిక్​ను భవిష్యత్​లో మరింత తీర్చిదిద్దుతా.  ఐక్యరాజ్యసమితి లోని సభ్య దేశాలు, వాటి రాజధానుల గురించి అవగాహన కల్పిస్తున్నా.  ప్రస్తుతం 50 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెబుతున్నాడు.  తర్వాత ఏషియన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుతో పాటు గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డు సాధించడమే లక్ష్యంగాహార్ధిక్ ను తయారు చేస్తా.

– తండ్రి డాక్టర్​ శ్రీనివాస్

Latest Updates