ఈపీఎఫ్ పై వడ్డీ పెంపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై ఇచ్చే వడ్డీ రేటును పెంచిన్నట్లు ఈపీఎఫ్ఓ బుధవారం ప్రకటించింది.  2017-18లో 8.55 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతానికి పెంచింది. ఈ విషయాన్ని EPFO ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దాదాపు 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు 54 వేల కోట్ల రూపాయలను వడ్డీగా డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపింది.

 

గడిచిన ఆరేళ్లలో ఈపీఎఫ్ పై వడ్డీ రేటు ఇలా ఉంది..

సంవత్సరం           వడ్డీ రేటు

2017-18             8.55%

2016-17             8.65%

2015-16             8.8%

2014-15             8.75%

2013-14             8.75%

2012-13             8.5%

Latest Updates