పెన్షన్ దారుల లైఫ్‌ సర్టిఫికెట్ల సమర్పణ గడువు పెంపు

పెన్షన్ దారుల లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) పొడగించింది. నవంబర్‌ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా కారణంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణ చేసుకోలేక పోయిన 35 లక్షల మందికిపైగా పింఛన్‌దారులకు లబ్ది చేకూరనుంది. వీరందరికీ ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఫెన్షన్ మంజూరు చేయనున్నారు అధికారులు.

ప్రస్తుతం లైఫ్‌ సర్టిఫికెట్‌ ను నవంబర్‌ 30లోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికెట్లను సాధారణ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, ఫించన్లు ఇచ్చే శాఖల్లో అందజేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ సమర్పించిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తించనుంది.

Latest Updates