ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం తమ్మి

హైదరాబాద్: నో స్మోకింగ్ ఏరియాలో స్మోకింగ్ చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎంతపెద్ద లీడర్లైనా..స్టార్లైనా వదిలిపెడుతలేరు సిటీ పోలీసులు. ఇందుకు ఉదాహారణ హీరో రామ్ కు ఫైన్ వేయడమే. సోమవారం హీరో రామ్ కు చార్మినార్ పోలీసులు నో స్మోకింగ్ ఏరియాలో సిగరేట్ తాగినందుకు ఫైన్ వేశారు. అయితే దీనిపై మంగళవారం ఉదయం రామ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

“నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే, షాట్లో కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ “లా” కి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గిపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్” అని రామ్ ట్వీట్ చేశాడు.  రామ్  పక్క హైద్రాబాద్ భాషాలో పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్న సమయంలోనే రామ్ కు ఫైన్ వేశారు పోలీసులు. రామ్ ‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా జూలై – 18న రిలీజ్ కానుంది.

Latest Updates