నన్ను కొందరు సీఎంలు మోసం చేశారు : ఎర్రబెల్లి

సచివాలయంలో మంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కాస్త ఉద్వేగంతో మాట్లాడారు. “సీఎం కేసీఆర్ నాకు పెద్ద బాధ్యత అప్పజెప్పారు. గ్రామపంచాయతీలు అందంగా తీర్చి దిద్దాలి, గతంలోలాగా పచ్చగా మారాలి. కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ రూపురేఖలు మారుతాయి. ఇది పెద్ద డిపార్ట్ మెంట్… పెద్ద బాధ్యత అప్పజెప్పారు. అన్నీ  నెరవేర్చి ఆయన మన్ననలు పొందుతా. నా 35 ఏళ్ల రాజకీయంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదు. నన్ను చాలా మంది మోసం చేశారు. ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారు. కానీ అడగకుండానే మంత్రి పదవి ఇవ్వటమే కాక ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు రుణపడిఉంటా. నమ్మకం నిలబెట్టుకొంటా” అని ఎర్రబెల్లి అన్నారు.

Latest Updates