ఇషా సింగ్ కు 3 గోల్డ్ మెడల్స్

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ అదరగొట్టింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో  3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అని అన్నది. 9 సంవత్సరాల వయస్సులో షూటింగ్ ప్రారంభించానని చెప్పింది. తాను చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నానని.. దీనికి చాలా అంకితభావం అవసరమని తెలిపింది.

Latest Updates