ఈశ్వరిబాయి పోస్టల్ కవర్ విడుదల

మహిళల హక్కుల కోసం పోరాడిన ఈశ్వరిబాయి పేరు మీద పోస్టల్ కవర్ విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పోస్టల్ కవర్ ను విడుదల చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. ఈ సందర్భంగా భట్టీకి ఈశ్వరి బాయి మెమోరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన ఈశ్వరీబాయి.. నమ్మిన సిద్ధాంతం కోసం తెగించి పోరాటం చేశారని చెప్పారు భట్టి విక్రమార్క. అందరికి విద్య అందించాలనే ఆశయంతో అమ్మ విద్యాసంస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు మాజీ మంత్రి గీతారెడ్డి.  గొప్ప వ్యక్తి పేరు మీద పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయడం తమకు గర్వంగా ఉందన్నారు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ చంద్రశేఖర్.

Latest Updates