24 మందితో TTD పాలక మండలి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో  తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి 8మందికి…తెలంగాణ నుంచి ఏడుగురుకి అవకాశం కల్పించింది.  అంతేకాదు తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్న నుంచి ఒక్కొక్కరికి పాలకమండలిలో స్థానం దక్కింది. ఏపీ నుంచి ఎమ్మెల్యేలు  యూవీ రమణమూర్తి, మల్లిఖార్జున రెడ్డి, గొల్ల బాబురావు, కె. పార్ధసారధి రెడ్డిలతో పాటు   వి.పార్ధసారథి, నాదెండ్ల సుబ్బారావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, డీపీ అంతాలను బోర్డు సభ్యులుగా తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి జే. రామేశ్వర రావు, బి. పార్ధసారథి రెడ్డి, యు. వెంకట భాస్కర రావు, మూరంశెట్టి రాములు, డి. దామోదర్ రావు, కె.శివకుమార్, పుట్టా ప్రతాప్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.

ఢిల్లీ కి చెందిన  ఎంఎస్ శివ శంకర్‌, కర్ణాటకకు చెందిన  రమేష్ శెట్టి, సంపత్ రవి నారాయణతో పాటు ఇన్ఫోసిస్ సుధానారాయణ మూర్తిలను పాలకమండలి సభ్యులుగా నియమించారు. మహారాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మను సభ్యుడిగా తీసుకున్నారు. TTD ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలుపుకుని మొత్తం పాలకమండలి సభ్యులు సంఖ్య 25.  వీరు కాకుండా తుడా ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్, TTD బోర్డు కార్యనిర్వహణాధికారి ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్నారు.

Latest Updates