గాంధీలో కరోనా పేషెంట్ మిస్సింగ్..స్పందించిన ఈటెల

గాంధీ హాస్పిటల్ లో కరోనా పాజిటివ్ పేషెంట్ మిస్సింగ్ పై స్పందించారు మంత్రి ఈటెల. పేషెంట్  మధుసూదన్ ఆస్పత్రిలో చేరిన( మే1న) 24 గంటల్లో చనిపోయారని చెప్పారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు కూడా చెప్పామన్నారు. అతని భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని కుటుంబానికి చెప్పలేదన్నారు. ఆ సమయంలో కుటుంబం ఆస్పత్రిలోనే ఉండటం వల్ల తామె దహన సంస్కారాలు చేశామన్నారు. బాడీని ఫ్రీజ్ లో పెట్టె పరిస్థితి లేదన్నారు.అప్పటికే  కుటుంబంలో ఒకరిని కోల్పోయారు కాబట్టి మరొకరు చనిపోయారని చెప్తే వారు తట్టుకోలేరని చెప్పలేదన్నారు.

వనస్థలిపురానికి  చెందిన  అలంపల్లి మాధవి  అనే మహిళ తన భర్త కనిపించడం లేదంటూ  మే 20న కేటీఆర్ కు ట్వీట్ చేసింది. గాంధీలో  కరోనా చికిత్స కోసం  అడ్మిట్ అయిన   తన భర్త  మధుసూదన్  కనిపించట్లేదంటూ  ట్విట్టర్ లో తెలిపింది. అయితే మాధవీ ట్వీట్ పై   గాంధీ సూపరిండెంట్  రాజారావు స్పందించారు. గాంధీలో జాయిన్  అయ్యే టైంకి   మధుసూధన్ కండిషన్  సీరియస్ గా ఉందని, కరోనాతో  పాటు  న్యూమోనియా  సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని  చెప్పారు. హాస్పిటల్ లో  అడ్మిట్  అయిన మరుసటి రోజే  మధుసూదన్  చనిపోయారని  స్పష్టం చేశారు. ప్రోసిజర్  ప్రకారం కుటుంబానికి  సమాచారం అందించామని చెప్పారు. మధుసూదన్  కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి  తెలిపిన  రాజారావు… గాంధీ హాస్పిటల్  పేరు, డాక్టర్లను అవమాన  పరిచేలా  మాట్లాడడం సరికాదన్నారు.

Latest Updates