ఎంపీగా కంటే.. వార్డ్ మెంబర్‌గా గెలవడం కష్టం : ఈటల

ముదిరాజ్  సమస్యల పరిష్కారం కోసం వైఎస్ రాజశేఖర్ తో తాము చర్చలు జరిపామని… రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బండ ప్రకాష్ కు కాంగ్రెస్ పార్టీ ఏమీ ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు పంపించిందన్నారు. పార్లమెంట్ సభ్యుడుగా గెలవడం ఈజీ కానీ..  వార్డ్ మెంబర్ గా సర్పంచ్ గా గెలవడం కష్టమన్నారు ఈటల. వార్డు మెంబర్ లు సర్పంచ్ లు కష్ట పడితేనే  బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ముదిరాజ్ లు గల్లా ఎత్తుకుని బ్రతికేలా చేస్తామన్నారు ఈటల రాజేందర్. బిచ్చగాళ్లలాగా ఉండకూడదు అని.. అన్ని కులాల వారికి.. వారి కుల దేవతల గుళ్ళు కట్టుకోడానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తోందన్నారు ఈటల.

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ 126 వ జయంతి వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించారు. విశ్వేశ్వరయ్య భవన్ లో ముదిరాజ్ ప్రజా ప్రతినిధులకు సన్మానించారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ , పలు సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు.

Latest Updates