పీపీఈ కిట్లు ఇవ్వకపోతేనే డాక్టర్లకు కరోనా వస్తదా?

హైదరాబాద్: ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లతోనే కరోనా కేసులు పెరిగాయన్నారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్. కరోనాపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ICMR, కేంద్రం సూచనలు పాటిస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత ఎక్కవ కేసులు పెరిగాయన్నారు. రాజకీయ కోణంలో కరోనాను చూడొద్దని.. ట్రీట్ మెంట్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. గాంధీలో ట్రీట్ మెంట్ బాగుందని పేషెంట్లే చెప్పారన్నారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొంది డిశ్చార్జ్ అయ్యాక వసతులపై కొన్ని వందల మంది మెచ్చుకున్నారని తెలిపారు.

పీపీఈ కిట్లు ఇవ్వకపోతేనే డాక్టర్లకు కరోనా వస్తదా? అన్నారు. డాక్టర్లకు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ వచ్చిందని.. దేశవ్యాప్తంగా కరోనా సమస్య ఉందన్నారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీపీఈ కిట్లు 10 లక్షలు ఉన్నాయని, మాస్కులు, మందుల కొరత మన దగ్గర లేదని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.

Latest Updates