సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఈటెల

సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో విషజ్వరాలు పెరిగినందున వైద్యశాఖ అధికారులతో కలిసి హైదరాబాద్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి. హైదరాబాద్ లోని హాస్పిటళ్లలాగే…జిల్లా దవాఖానాల్లోనూ సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభించాలని సూచించారు.  మందుల కొరత లేకుండా చూడాలని…సిబ్బంది లేకుంటే వెంటనే భర్తీ చేయాలని అధికారులను కోరారు. ఈ భేటీలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపుల్ సెక్రెటరీ శాంతికుమారీ, డీఎన్ఏ రమేష్ రెడ్డి, వైద్యవిధాన కమిషనర్ మాణిక్యరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest Updates