ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం కృషిచేస్తున్నాం

హైదరాబాద్: ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ‘వరల్డ్ రేర్ డీసీస్’ డే సందర్భంగా శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఈటల. సభలో ఆయన మాట్లాడుతూ…  ఎంత సైన్స్, టెక్నాలజీ వచ్చినా.. పక్కవారి వేదన చూసి మనిషిగా చలిస్తామని అన్నారు. అరుదైన రోగాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన రీసెర్చ్ కంటే ఫార్మా కంపెనీలు ఎక్కువ రీసెర్చ్ చేసాయని అన్నారు. రాకెట్ కంటే పిల్లల గుండె కు స్టెంట్  కనుగొన్నప్పుడు నాకు సంతోషంగా ఉంటుందని అన్న  అబ్దుల్ కలామ్ మాటలను ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలో 40 కోట్ల పైచిలుకు వున్నారని…అందులోనుంచి మన రాష్ట్రంలో 5 శాతం మంది ఉన్నారని చెప్పారు.

జెనెటిక్ ప్రివెన్షన్ లేని రోగాలు ఉన్నాయని చెప్పారు ఈటెల. ఇలాంటి రోగాలు ఉన్న పిల్లలు ఉంటే.. కుటుంబానికి ఎంతో భారం, శ్రమ అని అనన్నారు. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాల్సిన రాష్ట్రం తెలంగాణ కావాలని కేసీఆర్ కోరుకున్నారని చెప్పారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అంగన్వాడీ సెంటర్స్ లో ఎగ్స్ పెంచామని అన్నారు. నీటి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు తెలంగాణలో ఎక్కువ కాబట్టి.. 40 కోట్లతో వాటర్ సోర్స్ పెంచినట్లు తెలిపారు.. వాటి ఫలితాలు త్వరలో తెలుస్తాయని అన్నారు.

మురికివాడల్లో డైయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టి రోగాన్ని ముందే గుర్తిస్తున్నామని చెప్పారు ఈటెల. మొరాల్టీ రేట్ తగ్గించేందుకు లాబ్ ఫెసిలిటీ తీసుకోస్తామని అన్నారు. రేర్ డీసీస్ లకు రీసెర్చ్ జరగాలని.. ఆ దిశగా అడుగులు వేయాలని…ఈ విషయంపై సీఎం కేసీఆర్ తో చర్చిస్తామని తెలిపారు. రోగాల వల్ల అనుకోని ఖర్చుకు కుటుంబాలు నాశనం అవుతున్నాయని అన్నారు…. గుజరాత్, తమిళనాడు రాష్ట్రల తరువాత ఆరోగ్యంలో  మనం ముందున్నామని తెలిపారు.

Latest Updates