వైద్యాధికారులతో మంత్రి ఈటెల సమావేశం

హైదరాబాద్‌: వైద్యాధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరోనా వైరస్‌ పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, ఆశా వర్కర్లను బెదిరిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  కాసేపట్లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. సమావేశంలో అధికారులు మంత్రులు పాల్గొంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

Latest Updates