కరోనాకు 1000కి మించి ఖర్చు కాదు..10రోజులు ఆక్సిజన్ పెట్టినా 2500 మించదు

కరోనాకు 1000కి మించి ఖర్చు కాదని అన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న..వ‌ర్షాకాలంలో అనేక ర‌కాలైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని కాబ‌ట్టి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు.

ప‌ట్ట‌ణాల నుంచి పల్లెలకు కరోనా విస్తరించిందన్న ఈటల.. అప్పట్లో కొన్ని కేసులు ఉండేవి… ఇప్పుడు కేసులు పెరిగాయ‌ని చెప్పారు. అయినా స‌రే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

జ్వ‌రం, జ‌లుబు తో పాటు ఎలాంటి ల‌క్ష‌ణాలున్నా వైద్యుల్ని సంప‌ద్రించాల‌న్నారు. క‌రోనా లక్షణం ఊపిరి ఆడ‌కుండా చేస్తుంద‌ని, ఒక‌వేళ అది సోకినా ట్రీట్మెంట్ తీసుకునేందుకు 1000కి మించి ఖర్చు కాదు..10రోజులు ఆక్సిజన్ పెట్టినా 2500 మించదని తెలిపారు.

ఏ హాస్పిటల్ అయినా.. అదే ట్రీట్మెంట్. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.15 వేల బెడ్స్ కు ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. జిల్లాలో కూడా ఐసోలేషన్ కేంద్రాలు పెట్టాం. హితం యాప్ ద్వారా రోజుకు 70 మంది డాక్టర్లు వర్క్ చేస్తున్నారు.

చనిపోయే స్టేజి లో ఉన్నవాళ్లను ప్రయివేట్ హాస్పిటల్స్ తీసుకోవడం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ కు ముందే చెప్పాం.. డబ్బులు ఎక్కువ వసూల్ చేయవద్దని.. కానీ వాళ్ళు వినలేదు. కంప్లైంట్స్ ను పరిగణలోకి తీసుకుని హెచ్చరించాం. రేపో, ఎల్లుండో.. మరో రెండు మూడు హాస్పిటల్స్ మీద వేటు వేస్తాం. కరోనా పాజిటివ్ వస్తే కుటుంబ సభ్యులు ఉండరు డాక్టర్స్ మాత్రమే మీ దగ్గర ఉంటార‌ని ఈటల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

Latest Updates