జూనియర్ డాక్టర్స్ తో సమావేశమైన ఈటల

హైదరాబాద్: గాంధీ హాస్పిటల్ లో డాక్టర్ పై దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. భద్రత కల్పించాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ తప్పుల వల్లే డాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. ఉదయం నుంచి హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్లను ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి ఈటల రాజేందర్. మాట్లాడేందుకు ప్రతినిధి బృందం సెక్రటేరియట్ కు రావాలని కోరారు. కానీ మంత్రి విజ్ఞప్తిపై స్పందించలేదు జూనియర్ డాక్టర్లు. తాము సీఎంనే కాలుస్తామని తెగేసి చెప్పారు. మంత్రితో చర్చించేందుకు సెక్రటేరియట్ కు వెళ్లలేదు. దీంతో స్వయంగా గాంధీ మెడికల్ కాలేజ్ కు వెళ్లారు మంత్రి ఈటల. సెమినార్ హాల్ లో జూనియర్ డాక్టర్లతో సమావేశమయ్యారు.

డాక్టర్లపై జరుగుతున్న దాడులపై ఎన్నిసార్లు చర్చిస్తారని ప్రశ్నిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. డిసెంబర్ లో కేంద్రం తీసుకువచ్చిన SPF జీఓను పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీలోనే కోవిడ్ ట్రీట్మెంట్ కాకుండా.. ఇతర హాస్పిటల్స్ లో కూడా పేషెంట్లను ఉంచాలంటున్నారు. త్వరలో జరగబోతున్న పీజీ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాడులు జరిగినప్పుడల్లా చర్చలు చేస్తున్నా.. ప్రయెజనం ఉండటంలేదని.. అందుకే నేరుగా సీఎంతోనే మాట్లాడతామని చెబుతున్నారు జూనియర్ డాక్టర్లు.

Latest Updates