అంఫన్ బాధితుల కోసం ఈయూ 5 లక్షల యూరోల సాయం

న్యూఢిల్లీ : బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను కుదిపేసిన అంఫన్ బాధితులను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ ) ముందుకు వచ్చింది. తుపాన్ కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందించేందుకు భారత్ 5 లక్షల యూరోల సాయం ప్రకటించింది. కరోనా వారియర్స్ రక్షణకు కూడా ఈ నిధులను వినియోగించాలని మన దేశాన్ని కోరింది. తొలి విడుదల సాయంగా నిధులను విడుదల చేసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు మానవతాధృక్పథంతో వ్యవహారించాలన్నది ఈయూ విధానమని ఈయూ క్రైసెస్ మేనేజ్ మెంట్ కమిషనర్ జానెజ్ లెనర్కిక్ చెప్పారు. అంఫన్ కారణంగా ఎఫెక్ట్ అయిన బంగ్లాదేశ్ కు కూడా ఈయూ సాయం ప్రకటించింది. అంఫన్ కారణంగా బెంగాల్ లో 80 మంది చనిపోయారు. ప్రధాని మోడీ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ప్రకటించారు.

Latest Updates