కోవిడ్ టైంలోనూ.. ఎంసీహెచ్ లో డెలివరీలు ఫుల్

జనగామ మాతా శిశు ఆరోగ్ కేంద్రంలో 401 కాన్పులు

మూడు జిల్లాల గర్భిణులకు ఆందుబాటులో వైద్యం

జనగామ, వెలుగు: పేద, మధ్య తరగతి తల్లీబిడ్డలకు మెరుగైన ట్రీట్ మెంట్ అందిం చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య కేం ద్రం) సత్ఫలితాలను ఇస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లలేని వారికి జనగామ శివారు చంపక్ హిల్స్​ వద్ద ఉన్న ఎంసీహెచ్ వరంగా మారిం ది. జనగామ, సిద్దిపేట, యాదా ద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలు మండలాల గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా ఈ హాస్పిటల్ సేవలు పొందుతున్నారు . డాక్టర్ల కృషితో ప్రతీ నెల కాన్పుల సంఖ్య పెరుగుతూ వస్తోంది జులైలో 401 ప్రసవాలు జరిగాయి. ఇందులో 116 సాధారణ ప్రసవాలుగా ఉండగా మిగిలిన 285 సర్జరీ ద్వారా చేసినవి ఉన్నా యి. కాగా మే లో 404, జూన్ లో 325 డెలి వరీలు చేశారు. ప్రతీ రోజు 15 నుంచి 18 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. కోవిడ్ టైం లోనూ ప్రసవాల సంఖ్య పెరగడంపై డాక్టర్లను అందరూ అభినందిస్తున్నారు.

డాక్టర్ల పనితీరు భేష్ ..

ఎంసీహెచ్ లో సేవలు మెరుగుపరుస్తున్నం. పెరుగుతున్నడెలివరీలే ఇందుకు సాక్ష్యం.. డాక్టర్లు, సిబ్బంది పనితీరు బాగుండడం వల్లే 400కు పైగా డెలివరీలు అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ ఎఫెక్ట్ ఉండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నం. పేద గర్భిణులు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి ఆర్థికంగా నష్ట పోవద్దు . ఎంసీహెచ్ సేవలను ఉపయోగించుకోవాలి. – పూజారి రఘు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్, జనగామ.

Latest Updates