వైరల్ వీడియో: మొసలికి హైఫై ఇచ్చిన తాబేలు!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా హ్యాండ్ షేక్ కు అందరూ బైబై చెప్పేశారు. దూరం నుంచే మాట్లాడుకుంటున్నారు. వైరస్ వల్ల ఫ్రెండ్స్ ను కూడా హగ్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. హైఫైవ్స్ కూడా చేసుకోలేని సిట్యువేషన్ మరి. కానీ ఇలాంటి నిబంధనలు జంతువులకు మాత్రం లేకపోవడం గమనార్హం. అందుకేనేమో ఈ వీడియోలో మొసలికి తాబేలు హైఫై ఇచ్చింది. ఇదిప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేశారు. ఒకర్నొకరు పలకరించుకుంటున్నాయని ఈ ట్వీట్ కు ఆయన సరదా క్యాప్షన్ జత చేశారు. వీడియోలో మొసలి పడుకొని ఉండగా, దాని వైపుగా ఓ తాబేలు ఈదుతూ వచ్చింది. మొసలిని గమనించిన తాబేలు దాన్ని మెళ్లిగా తాకుతూ మరో దిశలో ఈదుకుంటూ వెళ్లిపోయింది. మొసలిని తాబేలు తాకిన టైమ్ లో ఆ రెండూ హైఫై ఇచ్చుకున్నట్లుగా కనిపించాయి. ఈ వీడియో ఫ్లోరియాలో తీసిందని తెలుస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 34.5 వేల వ్యూస్ వచ్చాయి. అలాగే 3.8 వేల లైక్స్ రావడం విశేషం. కరోనా మనుషులకు మాత్రమేనని, అవి (జంతువులు) హగ్ చేసుకోవచ్చునని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి తాబేలు-మొసలి హైఫై వీడియోను మీరూ లుక్కేయండి.

Latest Updates