ఎవరైతే మాకేంటి?.. ఎలుగుబంటిని భయపెట్టిన కుక్కలు!

న్యూఢిల్లీ: బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ ఛేంజ్.. అనే ఫేమస్ డైలాగ్ వినే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోని డైలాగ్ ఇది. ఈ సీన్‌‌లో బలహీనుల పక్షాన ఎన్టీఆర్ తోడుగా నిలబడి బలవంతులను కొడతాడు. మనం మాట్లాడుకోబోయే వీడియోలో బలమైన ఎలుగు బంటిని భయపెట్టడానికి బలహీనమైన కుక్కలు ఎవ్వరి అండా లేకుండా సొంతంగా యత్నించడం విశేషం. ఎలుగు బంటి, కుక్క వీటిల్లో ఏ జంతువు మరోదానికి భయపడుతుందంటే.. ఎలుగుకు కుక్క భయపడుతుందనే చెబుతారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ వీడియో రెండు బుల్లి కుక్కలు కలసి ఒక భారీ ఎలుగును పారిపోయేలా చేయడం గమనార్హం.

వివరాలు.. పార్కులో రెండు బుజ్జి కుక్కలు ఆడుకుంటున్నాయి. అకస్మాత్తుగా దగ్గరి పొదల్లో నుంచి ఎలుగు బంటి దూసుకొస్తుంది. వెంటనే అప్రమత్తమైన కుక్కలు అరుస్తూ ఎలుగు బంటి వైపు దూసుకెళ్లడానికి యత్నించాయి. ఎలుగు ఫెన్స్‌‌‌పై కూర్చున్న సమయంలో కుక్కలు తీవ్రంగా మొరిగాయి. దీంతో ఎలుగు బంటి ఫెన్సింగ్ పై నుంచి దూకి వెళ్లిపోయింది. ఇలాంటి వీడియోను తామెప్పుడూ చూడలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో నేచర్ ఈజ్ స్కేరీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ అయింది. మరి ఎలుగునే భయపెట్టిన సదరు క్యూట్ కుక్కల సాహసాన్ని మీరూ లుక్కేయండి..!

Latest Updates