తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదు

రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులు పండించే ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే కొనుగోలు జరగాలన్నారు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేంత వరకు తాము పోరాటం చేస్తామన్న ఉత్తమ్.. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం బట్టబయలైందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. గల్లీమే కుస్తీ, ఢిల్లీమే దోస్తీ అన్నట్టుగా ఈ పార్టీల వ్యవహారం ఉందన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవ కోసం జానారెడ్డి పాటుపడ్డారని… అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు ఉత్తమ్.

Latest Updates