లాక్ డౌన్ పొడిగించొద్దని కోరుకుందాం: హేమా మాలిని

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సినిమా స్టార్స్ తమవంతుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ హేమా మాలిని ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. లాక్ డౌన్ త్వరగా ముగిసిపోవాలని.. మూడోసారి లాక్ డౌన్ వేయాల్సిన పరిస్థితి రావొద్దనే కోరుకుందాం. అందుకు ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మాస్క్ లేదా దుపట్టాలను వాడండి. ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్, రైతులు తప్పక మాస్కులు కట్టుకోండి. జర్నలిస్టులు, పోలీసులు, డాక్టర్లతోపాటు ప్రభుత్వానికి సాయం చేయండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనతోపాటు మన కుటుంబాలకూ తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. లాక్ డౌన్ త్వరగా ముగిసిపోవాలని నాతో పాటు దేశం మొత్తం కోరుకుంటోంది. అలా జరగాలంటే అందరూ ఇళ్లలోనే ఉండండి, సురక్షితంగా ఉండండి’ అని ఆ వీడియోలో హేమా మాలిని చెప్పారు.

Latest Updates