ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తాం

కరోనాకు వ్యాక్సిన్ రెడీ అయిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం పళనిస్వామి. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఫ్రీగా ఇస్తామంటూ ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. లేటెస్టుగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు బీజేపీ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ కు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తే… మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

Latest Updates