EVM లపై అనుమానం ఉంది: ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్ చీటీలు పూర్తిగా లెక్కించాలన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల ఓటర్ల లిస్టును కుదించారన్నారు. తెలంగాణలో EVMలు పూర్తిగా ట్యాంపరింగ్, మ్యానిపులేట్ అయ్యాయని ఆరోపించారు. EVMలపై అనుమానం ఉందని… అనుమానాలు నివృత్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను కోరుతామన్నారు. వీవీప్యాట్ల‌లో ఉన్న స్లిప్‌ల‌ను కూడా లెక్కించాల‌న్నారు. ఈ విషయంలో అందరు ప్రజాకూటమి అభ్యర్ధులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి వీవీప్యాడ్ లెక్కింపు జరిగేంత వరకు పట్టుబట్టాలన్నారు. ఎన్నికల్లో ఎవరెవరు ఓడిపోతారో ముందుగానే ఎలా చెప్పారో తెలపాలని డిమాండ్ చేశారు ఉత్తమ్.

Posted in Uncategorized

Latest Updates