ఓట్ల లెక్కల్లో అన్నీ చిక్కులే!

ఓట్ల మిషన్ల ట్యాంపరింగ్‌ జరగలేదని తేల్చటానికి వీవీప్యాట్లలో స్లిప్ లను చెక్ చేస్తారు. ఎన్ని స్లిప్ లను చెక్ చేస్తే సరిపోతుందో ఇంకా క్లారిటీ రాలేదు. కనీసం సగం స్లిప్ లనైనా తనిఖీ చేయాలని పొలిటికల్ పార్టీలు కోరుతున్నాయి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కి ఐదు చొప్పున ఈవీఎంలను సరిచూడాలని సుప్రీంకోర్టు తాజాగా ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మీద 479 ఈవీఎంలను వెరిఫై చేస్తే చాలని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ రిపోర్ట్ ఇవ్వటంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గుణాంకాలు వేరు.. టెక్నాలజీ వేరు
ఇండియన్ స్టాటిస్టిక్స్​కు పితామహుడిగాపేరొం దిన పీసీ మహలనోబిస్ చెప్పినమాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ‘గణాంకాలు వేరు. టెక్నాలజీ వేరు. రెండింటినీ కలిపి చూడకూడదు. మన దేశంలోని అధికారిక వ్యవస్థలకు స్టాటిస్టిక్స్​ని ఒక కీలకమైన టెక్నాలజీగా అప్లై చేయటం కష్టం ’ అని ఆయన 54 ఏళ్ల కిందటే తేల్చిచెప్పారు. అమెరికన్స్  స్టాటిస్టికల్ అసోసియేషన్ 125వ మీటింగ్ లోమహలనోబిస్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఎంత విలువైందో, ఎంత సందర్భోచితమైందోకదా అని ఇప్పుడు అనిపిస్తోంది.

 

గత ఎన్నికల్లో ఎన్నడూ లేని ఓ కొత్త వివాదం ఈ ఎన్నికల్లో తలెత్తింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) ట్యాంపర్ అవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అధికారంలో ఉన్నోళ్లు ఓట్ల మిషన్లను అనుకూలంగా మలచుకుంటు న్నారని ఆరోపిస్తున్నాయి. జనం ఏ పార్టీకి ఓటేసినా పవర్ లోఉన్న పార్టీ అభ్యర్థికే పోతోందని డౌట్ పడుతున్నాయి. అది తప్పని నిరూపించటానికి వీవీప్యాట్లలోని రిసీట్లను ఈవీఎంలో నమోదైన ఓట్లతో పోల్చిచూడాలని డిమాం డ్ చేస్తున్నాయి. మినిమం సగం వీవీప్యాట్ లనైనా పరిశీలించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలోనూ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఐదు ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్ లతో ట్యాలీ చేయాలని కోర్టు ఈసీకి చెప్పింది. ఈ లెక్కన భారీగా నే ఈవీఎంలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్కమెతుకును పట్టిచూస్తే సరిపోతుందనే సింపుల్ లాజిక్ తెరపైకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలుఎన్ని ఈవీఎంలను ఈ విధంగా చెక్ చేస్తే సరిపోతుందో తేల్చటానికి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూ ట్(ఐఎస్ఐ) ఓ ప్రయత్నం చేసి ఈసీకి రిపోర్ట్ ఇచ్చింది.

మనది ప్రెసిడెన్షియల్ సిస్టం కాదు
నివేదిక తయారీకి తీసుకున్న అంశాలు వాస్తవాని-కి దగ్గరగా లేవు. ఏడున్నర నెలల పాటు స్టడీ చేసిఈ రిపోర్టు రెడీ చేశారు. దిగువ సభలోని మొత్తంసీట్లు 543. దీని ప్రకారం ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కోఈవీఎంని కూడా పరిశీలించాల్ సిన అవసరం లేదని,ర్యాండమ్ గా 479 ఓట్ల మిషన్లను వెరిఫై చేసినాచాలని తేల్చారు . ఈవీఎంల తయారీలో లోపాలురెం డు శాతానికి మిం చి ఉండవని చెప్పారు . ప్రెసిడె-న్షియల్ ఎలక్షన్ సిస్టమ్ ప్రాతిపదికన ఈ అంచనాకువచ్చారు . మన దేశంలో జనరల్‌ ఎలక్షన్స్‌ దీనికి పూర్తిభిన్నంగా జరుగు తాయి.దేశమంతా ఒకే క్యాండిడేట్ ఉండరు. ఒక్కో చోటఒక్కో అభ్యర్థికి ఓటేస్తారు. దీనికి అనుగు ణంగా ఈవీ-ఎంల్లో పోటీదార్ల పేర్లు చేర్చాలి. కాబట్టి డీఫాల్ట్​​ టెక్ని-కల్ డిఫెక్ట్​లు రెం డు శాతం కన్నా ఎక్కువే ఉండొచ్చు.ఈ తరహా ఎన్నికల వ్యవస్థలో ప్రజలు తమ ఓటు కరెక్ట్​గా ఎవరికి పడిం దో కన్ఫాం చేసుకోవాలనుకుంటారు .ఎలక్షన్ న్యాయంగా జరగాలని, మిషన్ ట్యాంపరిం గ్ద్వారా కాదని కోరుకుంటారు . అందువల్ల ‘ఒక లోక్సభ నియోజకవర్గంలో ఒక ఈవీఎం’కి బదులు సాధ్య-మైనన్ని ఎక్కువ యంత్రాలను సరిచూడటంబెటర్ .

రెండు శాతమే అనుకున్నా..
రిపోర్ట్​లో చెప్పినట్లు ఈవీఎంల మాన్యు ఫాక్చరింగ్‌​ డిఫెక్ట్​ రెం డు శాతమే అనుకుందాం . ఈ లెక్కన ఒక లోక్ సభ నియోజకవర్గంలో సగటున 1500 ఈవీఎంలు–వీవీప్యాట్ లు వాడారనుకుందాం . రెం డు శాతం తయారీ లోపాలుంటే ఆ సెగ్మెంట్ లో కనీసం 30 ఈవీఎంలను, వీవీప్యాట్లను ట్యాలీ చేయాలి. ఈ చొప్పున దేశం మొత్తం మీద కొన్ని వేల ఈవీఎంలను, వీవీప్యాట్ లను క్రాస్ చెక్ చేయాలి. కాబట్టి నివేదికలో అనుసరిం చిన హైపర్ జామెట్రిక్ మోడల్ తప్పుదోవ పట్టిం చేలా ఉన్నట్లు అర్థమవుతోంది.

మిస్ మ్యాచ్ అయితే
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ ప్రకారం 479ఈవీఎంలను, వాటికి లింక్‌ చేసిన వీవీప్యాట్ స్లిప్లతో ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు ఒకవేళ ఒక్క యంత్రంలో లెక్క తేడా వస్తే అదనంగా 128 ఈవీఎంలను తనిఖీ చేయాలి. రెండు మిషన్లు మిస్ మ్యాచ్ అయితే, 128తోపాటుమరో 110 ఈవీఎంలను, వీవీప్యాట్ రసీదులను పరిశీలించాలి.ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా10.35 లక్షల పోలింగ్‌ బూత్ లు ఏర్పాటు చేశారు.గత ఎన్నికల్లో వీటి సంఖ్య 9.28 లక్షలు ఉండగా, కొత్త ఓటర్ల నమోదు కారణంగా ప్రస్తుత జనరల్‌ ఎలక్షన్స్ లో 10.1 శాతం మేర పోలింగ్ స్టేషన్లను పెంచాల్సివచ్చింది. అలాగే, దాదాపుగా 39 లక్షల 60 వేలఈవీఎంలను, 17 లక్షల 40 వేల వీవీప్యాట్ లను వినియోగిస్తున్నారు . వీటిలో కొన్ని రిజర్వ్​లో ఉంచుతారు. ఈ లెక్కన లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా పొలిటికల్‌ పార్టీలు కోర్టు గుమ్మం ఎక్కడం ఖాయం.

 

అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యలో తేడాలు
ఒక లోక్ సభ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు చొప్పున ఈవీఎంలను, వీవీప్యాట్రిసీట్లను సరిచూడాలనటంలోనూ సరైన లాజిక్లేదు. ఎందుకంటే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల సంఖ్య ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లోప్రతి లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఐదు అసెంబ్లీ సీట్లుఉన్నాయి. అదే మిజోరాంలో అయితే ఒకే ఒక లోక్ సభ స్థానమే ఉండగా దాని పరిధిలోకి ఏకంగా 40అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. దీన్ని బట్టి యూపీలో ఒక లోక్ సభ నియోజకవర్గంలో 25 మెషిన్లనే చెక్ చేస్తుండగా మిజోరాం లో 200యంత్రాలను తనిఖీ చేయాల్సి ఉంది. 20తో పోల్చితే 200 చాలా పెద్ద సంఖ్య కాబట్టి ఈవీఎంల, వీవీప్యాట్ కాగితాల పరిశీలనలోనూ రిస్కు ఆ స్థాయిలోనే ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసలు అసెంబ్లీ సెగ్మెంట్లే ఉండవు. అక్కడ ఏ ప్రాతిపదికన, ఏ ఏరియాలోని ఈవీఎంలను సరిచూస్తారు?. ఇలా చెప్పుకుంటూపోతే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్ ఇచ్చిన రిపోర్ట్ లో  లోపాలెన్నో.

 

Latest Updates