EVM అంటే.. ఎవ్రీ ఓట్ ఫర్ మోడీ: బీజేపీ సీఎం

ఎన్నికల సమయంలో హర్యానా సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈవీఎం (evm)అంటే ఎవ్రీ వోట్ ఫర్ మోడీ ,ఎవ్రీ ఓట్ ఫర్ మనోహర్ అని ట్వీట్ చేశారు. పార్లమెంటుకు అయితే ప్రతీ ఓటు మోడీకి, రాష్ట్రానికి అయితే ప్రతీ ఓటు మనోహర్ కే అని అన్నారు. మోడీకి వేసినా తనకు వేసినా గుర్తు మాత్రం కమలం అని అన్నారు.  హర్యానాలో బీజేపీ 75 కు పైగా సీట్లు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మనోహర్ ట్వీట్ పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పాయి. ఓ వైపు దేశ వ్యాప్తంగా ఈవీఎం మిషన్లపై రచ్చ జరుగుతుంటే సీఎం లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించాయి. దీంతో మనోహర్ లాల్ ఖట్టర్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు.

Latest Updates