అల్లరి నరేష్ నాయనమ్మ కన్నుమూత

అల్లరి నరేష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతొ బాధపడుతున్న ఆమె.. మంగళవారం నిడదవోలు మండలం కోరుమామిడిలోని త‌న స్వ‌గృహంలోనే మ‌ర‌ణించారు. 2011లో పెద్ద కొడుకు ఈవివి క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె ఒక్క‌రే సొంతూళ్లో ఉంటున్నారు.

ఆమె అంత్యక్రియల్లో అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఇ సత్తిబాబుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. వెంకటరత్నమ్మకు న‌లుగురు సంతానం. అందులో అల్ల‌రి న‌రేష్ తండ్రి ఈవివి స‌త్య‌నారాయ‌ణ పెద్ద కొడుకు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు.

Latest Updates