హాజీపూర్ ఘటన చాలా బాధకరం: బండారు దత్తాత్రేయ

Ex central minister bandaru dattatreya visits Hajipura victim families

యాదాద్రి భువనగిరి : బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో సైకో శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలను కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. హాజీపూర్ ఘటన చాలా బాధకరమన్నారు. 2015లో కల్పన మిస్సింగ్ కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే మరో రెండు ప్రాణాలు పోకుండా ఉండేవని అన్నారు. చిన్నారులను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. న్యాయం జరిగేంతా వరకు బాధితుల పక్షాల పోరాడతామని చెప్పారు. హాజీపూర్ కు శాశ్వత బస్సు సదుపాయం, వాగు పై బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి తో మాట్లాడతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

Latest Updates