సొంత దేశంలో చిక్కుకుపోయిన మాజీ సోల్జర్

భోపాల్: విచిత్ర పరిస్థితుల్లో ఇండియాలోనే సెటిలైన చైనా సైనికుడొకరు యాభై ఏళ్ల తర్వాత సొంతూరికి వెళ్లాడు. తిరిగొచ్చేందుకు వీసా కోసం అప్లయ్​ చేసుకుంటే అధికారులు తిరస్కరించడంతో చైనాలోనే చిక్కుకుపోయాడు. చైనాలోని షాంక్సి ప్రావిన్స్​క్సియాన్ యాంగ్​గ్రామానికి చెందిన వాంగ్​చాంగ్​క్వి 1963 లో ఇండియాతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. మిగతా సైనికులతో కలిసి ఇండియాకు వచ్చాడు. ఇండియన్ సైనికులకు ఖైదీగా చిక్కడంతో గూఢచర్యం ఆరోపణలతో చాంగ్​ను జైలుకు పంపించారు. ఆరేళ్ల తర్వాత 1969 లో బయటికొచ్చిన చాంగ్​ మధ్యప్రదేశ్​లోని టిరోడాలో సెటిలయ్యాడు. ఓ మిల్లులో పనిచేస్తూ 1974లో అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలకు తండ్రయ్యాడు. ఆ తర్వాత సొంతంగా ఓ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించాడు.

యాభై నాలుగేళ్ల తర్వాత సొంతూరును చూసొద్దామని 2017 ఫిబ్రవరిలో చైనా వెళ్లాడు చాంగ్​. మే నెలలో తిరిగొచ్చి, మళ్లీ ఆగస్టులో చైనా వెళ్లాడు. భార్యకు అనారోగ్యమని తెలిసి అక్టోబర్​లో తిరిగొచ్చాడు. భార్యతో పాటు పెద్ద కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాతి ఏడాది 2018 జనవరిలో మరోసారి చైనా వెళ్లి ఏప్రిల్​లో తిరిగొచ్చాడు. కొంతకాలం గడిచాక అక్టోబర్​లో మరోసారి చైనా వెళ్లిన చాంగ్​క్వి.. తిరిగి రావడానికి వీసా కోసం అప్లికేషన్​పెట్టుకోగా  అధికారులు తిరస్కరించారు. ఎలాంటి కారణం చూపకుండానే వీసాను తిరస్కరించడంతో చాంగ్​అక్కడే చిక్కుకుపోయాడు. ఇండియాలోని కొడుకు విష్ణు వాంగ్​కు ఫోన్​చేసి విషయం చెప్పాడు. వాంగ్​కూడా ఇక్కడి అధికారులతో మాట్లాడినా ఉపయోగంలేకుండా పోయింది. తండ్రి రాక కోసం తామంతా ఆతృతగా ఎదురుచూస్తున్నామని, అధికారులు చొరవ తీసుకుని చాంగ్​క్వి ని ఇండియాకు తీసుకురావాలని విష్ణు కోరారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates