యాదాద్రిలో మనవరాలికి కడియం శ్రీహరి అన్నప్రాసన

Ex Deputy CM Kadiam Srihari visits Yadadri temple with His family members

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం కుటుంబ సమేతంగా యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహుని సన్నిధానంలో తన మనవరాలికి అన్నప్రాసన వేడుకను నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ పునర్ నిర్మాణ పనులను కడియం పరిశీలించారు. సీఎం కేసీఆర్ కృషితో యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, భక్తుల వసతి కోసం  టెంపుల్ సిటీ పేరుతో.. పెద్దగుట్టపైన కాటేజీ నిర్మాణం ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

వీకెండ్ కావడంతో ఆదివారం రోజున యాదాద్రికి భక్తులు పోటెత్తారు.  నరసింహాస్వామి దర్శనానికై ఆలయం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

Latest Updates