మంత్రుల ఇండ్ల ముందు పిండం పెట్టండి: బొడిగె శోభ

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. గత వారం రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల గురించి సమ్మె చేస్తుంటే మంత్రులెవరికీ పట్టడం లేదని అన్నారు. మన సమస్య పరిష్కరించని మంత్రులు, ముఖ్యమంత్రి అయినా మనోళ్లు కాదని అన్నారు. సమ్మెలో 11వ రోజు మంత్రుల ఇండ్ల ముందు పిండం పెట్టండని అన్నారు.

విద్యార్థులు ఆర్టీసీ సమ్మెకు మద్ధతిస్తారనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బొడిగె శోభ అన్నారు. ఉత్తర తెలంగాణ రామేశ్వర్ రావుకు, దక్షిణ తెలంగాణను మెగా కృష్ణారెడ్డికి ఆర్టీసిని అప్పగించేందుకే ఈ కుట్ర అని చెప్పారు.

“నీ అయ్య ముఖ్యమంత్రి కాకుంటే..! నీవు మంత్రివవుదువా?”అని, “చింతమడకలో వార్డు మెంబరు కూడా కాకపోదువు.” అని కేటీఆర్ ఉద్దేశించి ఆమె  అన్నారు.

EX MLA bodige shobha comments on RTC strike at Karimnagar

Latest Updates