మాజీ ఎమ్మెల్యే సింప్లిసిటీ

ఇతనెవరో తెలుసా? ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య. సాదాసీదా జీవితం గడిపే ఆయన ఏదో పనిమీద మంగళవారం హైదరాబాద్‌‌ వచ్చారు. మధ్యాహ్నం వేళ బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కన్పించారు.

వార్డ్ మెంబర్ గా గెలవగానే.. లెవల్ చూపిస్తూ.. బిల్డప్ ఇచ్చే నాయకులు ఎందరినో చూస్తుంటాం. అలాంటిది.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయన సింప్లిసిటీ మరువలేదు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ తరం పరేషాన్ అవుతుంది. పదవిలో ఉన్నంతకాలం గుమ్మడి నర్సయ్య బస్సు, రైల్ లో హైదరాబాద్ వచ్చేవారు. ఆటోలో అసెంబ్లీకి వెళ్లేవారు. విద్యానగర్ లోని పార్టీ ఆఫీస్ లో ఉండేవారు. ఎమ్మెల్యేగా వచ్చిన జీతం మొత్తం సీపీఐ ఎంఎల్- న్యూ డెమోక్రసీ పార్టీకే విరాళంగా ఇచ్చేవారు. ఆయనకు కొంత పొలం తప్ప.. వేరే ఆస్తులే లేవు. అప్పటి నాయకులు, కమ్యూనిస్టు యోధుల లైఫ్ స్టైలేవేరు. గ్రేట్ లీడర్.

Latest Updates