కేసీఆర్ తెలంగాణను వదిలి.. రాయలసీమను రతనాలసీమగా మార్చేలా ఉన్నడు

సీఎం కేసీఆర్ కు రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కన్నా.. కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ చంద్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ఏపీ చేస్తున్న జలదోపిడిపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు రమ్మంటే భయమేందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీ జలదోపిడీపై కేసీఆర్ వ్యవహారశైలిని ఎండగడుతూ ఆయన సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఏపీ జలదోపిడీని నివారించడంలో మరియు టెండర్లను అడ్డుకోవడంలో కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై సందేహలు కలుగుతున్నాయి. ఆగస్టు 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఉన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేసీఆర్ ఎగ్గొట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఆగస్ట్ 19న ఖరారయిన తర్వాత సమావేశానికి అటెండ్ అవుతానన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల కన్నా.. కేసీఆర్ కు కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత సీఎంపై ఉంది. కానీ, ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే.. మీరు తెలంగాణ గడ్డపై ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక పోగా.. రాయలసీమను రతనాలసీమ చేస్తా అనే హామీని నెరవేర్చడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాయలసీమను సస్యశ్యామలం చేసే విషయంలో మాకే అభ్యంతరం లేదు. కానీ, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం’ అని ఆయన అన్నారు.

For More News..

కరోనాతో మేడ్చల్‌ డీఐఈవో మృతి

ఎమ్మెల్యే మేనల్లుడి వివాదాస్పద ఫేస్ బుక్ పోస్ట్.. అల్లర్లలో ముగ్గురు మృతి

అమెరికా ఉపరాష్ట్రపతి రేసులో తెలుగు మహిళ

Latest Updates