హాజీపూర్ బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలి: దత్తాత్రేయ

హాజీపూర్ ఘటన బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ దత్తాత్రేయ. హాజీపూర్ లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. చిన్నారులను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. న్యాయం జరిగేంతా వరకు బాధితుల పక్షాల పోరాడతామని చెప్పారు. హాజీపూర్ కు శాశ్వత బస్సు సదుపాయం, వాగు పై బ్రిడ్జి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి తో మాట్లాడతానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

Latest Updates