రాజకీయాలకు దూరంగా ఉంటా..జగన్ మావాడే: జేసీ

తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం ఎస్సీ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ..40 ఏళ్లుగా సహకరించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చానని..ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జగన్ తమ వాడేనని..తనను రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా ఏనాడు విమర్శలు చేయలేదన్నారు. మోడీతో జగన్ సఖ్యతగా ఉండటం మంచేదనన్నారు జేసీ.

Latest Updates