జగన్ తెలివైనోడు..100రోజులకు100మార్కులు: జేసీ

సీఎం జగన్ వంద రోజుల పాలనపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ తెలివి తక్కువ వాడు కాదని అన్నారు. వంద రోజుల పాలనలో జగన్ కు వందకు వంద మార్కులు పడాల్సిందేనన్నారు. అవసరమైతే నూటికి నూటపది మార్కులు వేయాల్సిందేనన్నారు. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా జగన్ తమ వాడేనన్నారు. ఆర్టీసీని  విలీనం చేయడం ప్రభుత్వానికి భారమన్నారు. జగన్ ను చేయిపట్టుకుని నడపించేవాడు కావాలని అన్నారు. ప్రతీ విషయాన్ని మైక్రోస్కో ప్ లోచూడాలి తప్ప పగలగొట్టి చూడొద్దన్నారు.

Latest Updates