కార్మికుల జీతాలకు పైసలు లేవా?: కేసీఆర్ పై వివేక్ ఫైర్

అబద్ధాలు చెప్పడం సీఎం కేసీఆర్ కు అలవాటైందన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. సీఎం తీరు… ఉద్యమంలో ఒకలా, ఇప్పుడు మరోలా ఉందన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన దళిత, గిరిజనుల గర్జనకు హాజరయ్యారు వివేక్. ఆర్టీసీ సమ్మెకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు వివేక్. అన్ని పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఇస్తున్నారని ఆరోపించారు. మేఘా సంస్థకు ఇచ్చేందుకు ధనం ఉంటుంది కానీ… కార్మికులకే ఉండవా అని ప్రశ్నించారు వివేక్.

Latest Updates