కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారు: వివేక్ వెంకటస్వామి

కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. D83, 86 కెనాల్ నీటికొసం పత్తిపాక ప్రాజెక్టుని నిర్మిస్తానని కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ.. ప్రాజెక్ట్ పై నిర్లక్ష్యం చేయడంతో.. పత్తిపాక కోసం సీఎం కేసీఆర్ ను నిలదీశానన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నీళ్లు కావాలనే రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  ప్రజల సొమ్ముతో కేసీఆర్ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రూ. 400కోట్లతో పూర్తయ్యే పత్తిపాక ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి..రూ.2400 కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఎందుకని ప్రశ్నించారు . నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ… కొడుకు కూతురికి మాత్రం పదవులు ఇస్తున్నాడు కేసీఆర్ అని అన్నారు.

Latest Updates