ఎక్స్ అఫీషియో ఓట్లతో మారింది సీను.

హైదరాబాద్, వెలుగు:

మున్సిపోల్స్ లో ఎక్స్ అఫీషియో ఓట్లతో ప్రజాతీర్పు తారుమారైంది. ఓటర్లు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మేయర్లు, చైర్ పర్సన్లు ఎన్నికయ్యారు. మున్సిపల్​ చట్టం ఇచ్చిన చాన్స్​ను బాగా వినియోగించుకున్న అధికారపార్టీ.. ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ సీట్లొచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ పార్టీ ఎక్స్ అఫీషియో తంత్రాన్ని ప్రయోగించింది. కొన్నిచోట్ల టీఆర్ఎస్ తరఫున గెలిచిన వారితో సమానంగా ఎక్స్​ అఫీషియోలు ఉండటం గమనార్హం. ప్రతిపక్షాలకు ఎక్కువ సీట్లొచ్చిన 14 చోట్ల టీఆర్ఎస్​ ఇలా పీఠం దక్కించుకుంది.

మళ్లీ కనవడరు

మేయర్, చైర్ పర్సన్ ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హడావుడిగా ఎక్స్​ అఫీషియోలుగా నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైతే వాస్తవంగా తాముండే చోటికి దూరంగా ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ చేరి ఓటేశారు. కానీ ఈ ఎక్స్​ అఫీషియో మెంబర్లెవరూ తిరిగి కౌన్సిల్ మోహం చూడరనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఆయా ఎక్స్​ అఫీషియో మెంబర్లు తాము నమోదు చేసుకున్న మున్సిపాలిటీల్లో జరిగే చర్చల్లో పాల్గొనవచ్చు. ఓటు వేయవచ్చు. స్థానికంగా ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. కానీ చాలా మంది ఎక్స్ అఫీషియోలు కేవలం మేయర్, చైర్మన్ ఎన్నిక ఓటింగ్​కు మాత్రమే వస్తారని అధికారులు చెప్తున్నారు. మున్సిపల్​ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేయడం చాలా తక్కువని అంటున్నారు.

గెలిచినోళ్లు సగం, ఎక్స్ అఫీషియోలు సగం

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. టీఆర్ఎస్ ఐదు సీట్లే గెలుచుకుంది. బీజేపీ 9 వార్డులతో పెద్ద పార్టీగా నిలిచింది. ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. కానీ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో చైర్​పర్సన్ పదవి దక్కొద్దన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఏకంగా ఐదుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎంపీ కేకే, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్​రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎగ్గె మల్లేశంలను తెచ్చి.. చైర్మన్ పదవి దక్కించుకుంది.

నిజామాబాద్‌‌లోనైతే ఆరుగురితో..

టీఆర్ఎస్​ నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధికంగా ఎక్స్ అఫీషియో సభ్యులను ఉపయోగించింది. ఇక్కడి 60 డివిజన్లలో బీజేపీ ఏకంగా 28 చోట్ల గెలిచింది. టీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, కాంగ్రెస్ 2, ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. మేయర్ పదవి కోసం 31 మంది కౌన్సిలర్లు అవసరం. దీంతో టీఆర్ఎస్​ మజ్లిస్​తో పొత్తుపెట్టుకుని, ఎక్స్​ అఫీషియోలుగా ఎమ్మెల్సీలు గంగాధర్, రాజేశ్వర్ రావు, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలతో ఓట్లు వేయించి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.

నారాయణఖేడ్ లో నలుగురు

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 7 గెలిచాయి. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కకుండా టీఆర్ఎస్​ నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులను పంపింది. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలతో చైర్మన్ పదవిని గెలుచుకుంది.

నల్లగొండలో ఇదే లెక్క..

నల్గగొండ మున్సిపాలిటీలో 48 వార్డులున్నాయి. కాంగ్రెస్​ 21 వార్డులు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. టీఆర్ఎస్ 19, బీజేపీ  6, మజ్లిస్, ఇండిపెండెంట్​ ఒక్కో సీటు గెలిచారు. బీజేపీ సహకారంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంటుందన్న ఉద్దేశంతో అధికార పార్టీ మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, తేరా చిన్నపరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ఎక్స్ అఫీషియోలుగా దింపింది.

భువనగిరి, కోస్గి, కొల్లాపూర్‌‌లో
మెజార్టీ లేకున్నా..

భువనగిరి మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో టీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 11, బీజేపీ 7, మజ్లిస్ 2 చోట్ల గెలిచాయి. తగిన మెజార్టీ లేకపోవడంతో మజ్లిస్ మద్దతు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఎక్స్​ అఫీషియోలుగా టీఆర్ఎస్​  చైర్మన్ పదవి సొంతం చేసుకుంది. కోస్గిలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఎక్స్ అఫీషియోగా ఓటేయడంతో టీఆర్ఎస్ గెలిచింది. కొల్లాపూర్ లో జూపల్లి వర్గం నుంచి గెలిచిన వారిని తీసుకోకుండా ముగ్గురు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో చైర్మన్ సీటును దక్కించుకున్నారు.

గ్రేటర్ చుట్టురా ఇట్లానే..

గ్రేటర్ హైదరాబాద్​ చుట్టూ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో చైర్మన్ సీటు దక్కించుకునే టీఆర్ఎస్ కు మెజార్టీ రాలేదు. ఎంపీలు, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా రంగంలోకి దింపి కొంపల్లి, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలను దక్కించుకు

Latest Updates