వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

సీరియస్ గానే ప్రణబ్‌ హెల్త్
వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌పై ఉంచి ట్రీట్మెంట్
బులెటిన్‌‌‌‌ రిలీజ్‌ చేసిన ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌
ఎంక్వైరీ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌, డిఫెన్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉంది. సోమవారం ఆయనకు బ్రెయిన్‌‌‌‌ సర్జరీ జరిగింది. బ్రెయిన్‌‌‌‌లో బ్లడ్‌‌‌‌ క్లాట్‌‌‌‌ కావడంతో ఆపరేషన్‌‌‌‌ చేసిన ఆర్మీస్‌ రీసెర్చ్‌‌‌‌అండ్‌‌‌‌ రిఫరల్‌ ‌‌‌హాస్పిటల్‌‌‌‌ డాకర్లు దానిని తొలగించారు. ఆపరేషన్‌‌‌‌కు ముందు చేసిన కరోనా టెస్ట్‌‌‌‌లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. నిపుణుల వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ‘ప్రణబ్‌‌‌‌కు బ్రెయిన్‌‌‌‌లో బ్లడ్ క్లాట్‌‌‌‌ కావడంతో సర్జరీ చేసి దానిని తొలగించాం. ఆపరేషన్‌ ‌‌‌తరువాత ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’ అని హాస్పిటల్‌‌‌‌ బులెటిన్‌‌‌‌ విడుదల చేసింది.

కరోనా సోకిందని స్వయంగా ట్వీట్‌ చేసిన ప్రణబ్‌
సర్జరీ కోసం హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన ఆయనకు కరోనా టెస్ట్‌‌‌‌ చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌‌‌‌ చేశారు. వారం రోజులుగా తనను కలిసిన వారంతా సెల్ఫ్‌ క్వారంటైన్‌‌‌‌లో ఉండాలని, కరోనా టెస్ట్‌‌‌‌ చేయించుకోవాలని కోరారు. ప్రణబ్‌‌‌ ‌కూతురు షర్మిష్ట ముఖర్జీకి ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్ కోవింద్‌ కాల్‌‌‌‌చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. డిఫెన్స్‌‌‌‌ మినిస్టర్‌ రాజ్‌‌‌‌ నాథ్ సింగ్‌ ఆర్‌అండ్‌‌ఆర్‌ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లి ప్రణబ్‌‌‌‌ ముఖర్జీ ఆరోగ్యంపై ఆరా తీశారు. సుమారు 20 నిమిషాల పాటు హాస్పిటల్‌‌‌‌లో ఉన్నారు. ప్రణబ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ఉన్నారని తెలిసిన వెంటనే ఆయన త్వరగా కోలుకోవాలని రాహుల్‌‌‌‌గాంధీ సహా, చాలా మంది లీడర్లు ట్వీట్లు చేస్తున్నారు. జులై 2012 నుంచి 2017 మధ్యకాలంలో ప్రణబ్‌‌‌‌ముఖర్జీ ఇండియా 13వ ప్రెసిడెంట్‌‌‌‌ వ్యవహరించారు.

For More News..

టాప్ టెన్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ విడుదల.. ఇండియా నుంచి ఒకే ఒక్కడు..

Latest Updates