ఆలయంలో తవ్వకాలు గుప్తనిధుల కోసమేనా?

కేశంపేట,వెలుగు: మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన కొందరు భక్తులు ఆలయానికి వెళ్లగా..అక్కడ తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు.  దీంతో గ్రామస్థులు సర్పంచి పల్లె ‌‌‌‌‌‌‌‌స్వాతి బాలీశ్వర్ దృష్టికి తీసుకొచ్చారు.  గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోని గర్భగుడి ఎదురుగా తవ్వకాలు జరిపి ఉంటారని..పౌర్ణమి రోజు జరిగి ఉండొచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు పరిశీలించారు.

Latest Updates