మద్యంపై 30 రోజుల్లోనే 230 కోట్ల ఆదాయం

జనవరి  నెల  అబ్కారీ శాఖకు  భారీ ఆదాయాన్ని  తెచ్చి పెట్టింది. న్యూ ఇయర్  వేడుకలు, సంక్రాంతి , మున్సిపల్  ఎలక్షన్స్ , మేడారం, సహకార ఎన్నికలు …ఇలా అన్నీ ఇష్యూస్ కలసి ఆదాయాన్ని  తెచ్చిపెట్టాయి.  సర్కార్ ఇటీవలే మద్యం  ధరలు  పెంచడం కూడా వ్యాపారులకు  కలిసివచ్చింది. 30 రోజుల్లోనే 230  కోట్ల ఆదాయంతో  వరంగల్ జిల్లా  రికార్డు సృష్టించింది.

వరంగల్ అబ్కారీ శాఖకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది.నెలన్నర రోజుల్లో జిల్లాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 258 వైన్ షాపులు,120 బార్లున్నాయి. ఇటీవలే సర్కార్ మద్యం రేట్లను పెంచడం వ్యాపారులకు మేలు చేసింది. మేడారం జాతర జరిగిన నాలుగు రోజుల్లో 10 కోట్ల మద్యం తాగారు మందు బాబులు. మున్సిపల్, సహకార ఎన్నికల్లోనూ మద్యం ఏరులై పారింది.దీంతో నెలరోజుల్లో వరంగల్ జిల్లాలో అబ్కారీ శాఖకు 230 కోట్ల ఆదాయం వచ్చింది. రెవెన్యూ పరంగా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందంటున్నారు అధికారులు.

నెల రోజుల్లో 16 వేల 440 కేసుల బీర్ల అమ్మకాలు జరగాయని రికార్డులు చెబుతున్నాయి.  దీనికి తోడు 13 వేల 709 మద్యం పెట్టెలు అమ్ముడు పోయాయంటున్నారు.

మద్యం వ్యాపారంతో ఎక్సైజ్ శాఖకు అంచనాలకు మించి ఆదాయం సమకూరింది.

Latest Updates