ఇండియాకు రావడం ఆనందంగా ఉంది

న్యూఢిల్లీ : టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సౌతా ఫ్రికా జట్టు శనివారం ఇండియా చేరుకుంది. ఇండియాకు రావడం ఆనందంగా ఉందని, మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నానని ఆ జట్టు పేసర్‌ రబాడ ట్వీట్‌ చేశాడు. ఈ నెల 15న ధర్మశాలలో జరిగే తొలి టీ20తో సిరీస్‌ మొదలవుతుంది. 18న మొహాలీలో, 22న బెంగళూరులో  టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్‌ 2 నుంచి టెస్ట్‌ సిరీస్‌ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు మూడు టెస్టులు ఆడతాయి. ప్రోటిస్‌ జట్టు ఢిల్లీలోని తమ దేశ హైకమిషనర్‌ కార్యాలయా నికి సోమవారం వెళ్లనుంది.

 

Latest Updates