నిర్భయ దోషుల ఉరి శిక్షలో కొత్త ట్విస్ట్

నిర్భయ దోషుల ఉరిశిక్ష కొత్త మలుపు తిరిగింది. జనవరి 22న ఉరి సాధ్యం కాదని  హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రపతి క్షమాభిక్ష నిర్ణయం వచ్చేదాకా ఉరితీయడం సాధ్యం కాదని ఢిల్లీ సర్కారు కోర్టుకు చెప్పింది. ముఖేష్ సింగ్ తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరి విషయంపై ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల స్టాండింగ్ కౌన్సిల్ తరపు లాయర్ రాహుల్ మెహ్రా.. ఢిల్లీ హైకోర్టుకు పరిస్థితి వివరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరిస్తే… ఆ టైం నుంచి 14 రోజుల తర్వాతే ఉరి శిక్ష విధిస్తారు. జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం దోషులకు 14 రోజుల నోటీస్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన జనవరి 22న ఉరి తీయడం దాదాపు అసాధ్యం. పైగా దోషుల్లో ముఖేష్ సింగ్ ఒక్కడే క్షమాభిక్ష పెట్టుకున్నాడు. మరో ఇద్దరు ఇంతవరకు క్యురేటివ్ పిటిషన్లు కూడా వేయలేదు. మరో దోషి వినయ్ శర్మ ఇంకా క్షమాభిక్ష దాఖలు చేయలేదు. పటియాల కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ను నిలిపేయాలంటూ ముఖేష్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇన్ని ట్విస్టుల మధ్య ఉరిశిక్ష పై సస్పెన్స్ కొనసాగుతోంది.

రాష్ట్రపతి క్షమాభిక్ష నిర్భయ దోషులకు చివరి ఆప్షన్. అంత వరకు న్యాయపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుతున్నారు. అందరూ ఒక్కసారిగా కాకుండా విడివిడిగా పిటిషన్లు వేస్తుండడంతో నిర్భయ కేసులో దోషులకు శిక్ష ఆలస్యం అవుతోంది. బ్లాక్ వారెంట్ జారీ అయి, సంతకం కూడా అయినా ఆప్షన్లు వాడుతుండడంతో అసలు ఉరి ఎప్పుడు పడుతుందా అన్న చర్చ జరుగుతోంది.

Execution of Nirbhaya convicts will not happen on Jan 22 as mercy plea filed: Delhi govt to HC

Latest Updates